calender_icon.png 3 March, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్థి కోసం తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు..

03-03-2025 02:37:26 PM

తెల్లాపూర్ డివినోస్ విల్లాస్ లో ఘటన

⁠7 నుంచి 8 కత్తి పోట్లు.. తల్లి రాధిక మృతి

పోలీసుల అదుపులో నిందితుడు

సోమవారం తెల్లవారుజామున తెల్లాపూర్ లో ఘటన 

పటాన్ చెరు,(విజయక్రాంతి): తెల్లాపూర్ డివినోస్ విల్లాస్ లో నివాసం ఉండే తెల్లాపూర్ గ్రామస్థులైన నవారి మల్లారెడ్డి కుటుంబం డివినోస్ విల్లాస్ లో ఉంటున్నారు. నవారి సందీప్ రెడ్డి పెద్ద కొడుకు..కార్తీక్ రెడ్డి చిన్న కొడుకు కాగా ఆస్తిని పంచాలని కార్తీక్ తరచూ ఇంట్లో గొడవ పడేవాడు. తల్లి రాధికా ఆస్తిని పంచుతాము కొదిగా ఆగు అని చెప్పేది మధ్యానికి బానిస అయినా కార్తీక్ ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున తల్లి తో గొడవ పడి కత్తి తో దాడి చేసాడు సుమారుగా 7నుంచి 8కత్తి పోట్లు పొడవడం తో దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది. అడ్డుకోబోయిన తండ్రికి కత్తి కాట్లు పడ్డాయి. విషయం తెలుసుకున్న కొల్లూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.