calender_icon.png 19 April, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాల..

07-04-2025 12:00:00 AM

‘ఒకే పని సేసేనాకి, ఒకే నాగ బతికేనా కి, ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాల.. పుడతామా ఏటి.. మళ్లీ? సెప్మీ..!’ అంటూ స్టార్ హీరో రామ్‌చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్ సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. ఆయన కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ కథానాయికగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తు న్నారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతా కంపై వెంకటసతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోందని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. ఇటీవల రామ్‌చరణ్ ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేసిన మేకర్స్ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ‘ఫస్ట్‌షాట్’ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించారు.

మేకర్స్ తెలిపిన ప్రకారం.. ఈ చిత్రం రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026, మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్‌చరణ్ పాత్ర సినిమాలో ఎలా ఉండనుందో ఈ ఫస్ట్ షాట్ వీడియో ద్వారా తెలియజేసింది చిత్రబృందం. ఇందులో చరణ్ లుక్ మాస్ అవతార్‌లో అదుర్స్ అనిపించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు; సంగీతం: ఏఆర్ రెహమాన్; ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల; ఎడిటర్: నవీన్ నూలి.