పోలీసుల అదుపులో ఏఎస్సై, కానిస్టేబుల్
భైంసా, జనవరి 12: ఆస్తి తగాదాలతో ముథోల్ మండల కేంద్రంలో ఒకరి హత్య జరిగింది. సీఐ మల్లేశ్, ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల పోలీస్ స్టేషన్‌లో రాందాస్ ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. తన బావమరిది సంవత్సరికం కోసం మొదటి భార్య కుమారుడు కరణ్ (32), అల్లుడు అనిల్(కానిస్టేబుల్)తో కలిసి రాందాస్ శనివారం రాత్రి ముథోల్ వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వారి మధ్య గొడవ జరిగింది.
అర్ధరాత్రి ఒంటిగంట అనంతరం కరణ్ కిందపడిపోయాడు. గమనించిన కరణ్ భార్య సుష్మ డయల్ 100కు సమాచారం ఇచ్చింది. స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధా రించారు. విషయం తెలుసుకున్న ముథోల్ సీఐ మల్లేశ్, ఎస్సై సంజీవ్, ఎస్పీ జానకిషర్మిల, భైంసా ఏస్పీ అవినాశ్‌కుమార్ ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన భర్తను మామ రాందాస్, అతడి అల్లుడు అనిల్ హత్యచేశారని మృతుడి భార్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.