27-03-2025 11:34:32 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కే.ఆర్.కే కాలనీకి చెందిన నితిన్ అనే వ్యక్తి పట్టణంలోని మసూద్ చౌక్ సమీపంలో బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ అశోక్ లు రిమ్స్ కు చేరుకొని సంఘటనపై ఆరా తీస్తున్నారు. అయితే కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక సమాచారం.