calender_icon.png 16 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని దుష్ట శక్తులు కుట్ర పన్నుతున్నాయి

14-04-2025 08:51:20 PM

వారి కుతంత్రాలను అడ్డుకుంటాం...

బెల్లంపల్లిలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ..

బెల్లంపల్లి (విజయక్రాంతి): రాజ్యాంగాన్ని మార్చేందుకు కొన్ని దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజల కొరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్ని వర్గాల ప్రజల కోసం ఉన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ విషయమై  రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు పోరాడుతామని ఈ విషయంపై ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేస్తామన్నారు చైతన్యపరిచి రాజ్యాంగానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎంపీ ప్రకటించారు. మహిళల హక్కుల పరిరక్షణకు అండగా ఉంటామని ఎనిమిది గంటల పని విధానాలను కాపాడుకుంటామన్నారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్, మత్తమారి సత్తిబాబు, ముడిమడుగుల మహేందర్ తాళ్లకృష్ణ మోహన్, తదితరులు పాల్గొన్నారు.