16-03-2025 12:09:03 AM
పిల్లలు కొందరు నిద్రలో ఉలిక్కిపడి లేచి కూర్చోవడం, ఏడవడం, అరవడం, వేగంగా ఊపిరి తీసుకోవడం చేస్తుంటారు. బుజ్జగిస్తే మళ్లీ కాసేపటికే నిద్రపోతారు. ఉదయానికి వాళ్లకేమీ గుర్తుండదు. దీన్నే నైట్ టెర్రర్‌గా చెబుతారు. 3 నుంచి 12 ఏళ్ల పిల్లల్లో ఈ రకమైన సమస్యతో బాధపడతారు. పిల్లలు ఉలిక్కిపడకుండా ఉండాలంటే ఏం చేంయాలి?
నిద్రలో లేస్తుంటే పిల్లలతోపాటు తల్లిదండ్రులకు సరిగ్గా నిద్ర ఉండదు. ఎన్నిసార్లు లేస్తున్నారో నోట్ చేసుకుని డాక్టర్లను సంప్రదించడం మేలు.
స్కూలు లేదా అపరిచితుల వల్ల భయపడుతునా ్నరా, ఒత్తిడికి గురవుతున్నారా అన్నది గమనించి వాటిని పోగొట్టే ప్రయత్నం చేయండి.
మీరు వాళ్ల పక్కనే ఉంటూ సౌకర్యంగా నిద్రపోయేలా చేయండి. మంచి కథ చెప్పడం, శ్రావ్యమైన సంగీతం వినిపించడం, పుస్తకం చదివించడం అలవాటు చేయాలి.
ప్రాణాయామం సాధన కూడా మంచి చేస్తుంది
రాత్రివేళ మొబైల్ వాడకం నిద్రలేమికి దారితీస్తుంది. కాబట్టి స్క్రీన్ టైమ్ తగ్గించాలి.