విజయవంతంగా నిర్వహించిన ‘మెడికవర్’ వైద్యులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8(విజయక్రాంతి): హైటెక్ సిటీలోని మెడికవర్ ఉమన్, చైల్డ్ ఆస్పత్రి వైద్యులు సొమాలియాకు చెందిన ఓ బాలుడికి సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సదరు బాలుడు 13 ఏండ్ల వయ కేవలం 19కిలోలు మాత్రమే ఉండేవాడని వైద్యులు చెప్పారు. కొంతకాలంగా కనీసం లాలాజలాన్ని కూడా మింగలేక ప్రాణాంతక సమస్యను ఎదుర్కొన్నాడు.
అతను ఆహారాన్ని మింగేలా సామర్థ్యాన్ని రూపొందించడానికి అత్యంత సంక్లిష్టమైన వైద్యం అందించారు. సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ డాక్టర్ మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ ట్రీట్‌మెంట్‌లో రెట్రో స్టెర్నల్ విధానం ద్వారా పెద్ద పేగు మార్పిడి చేశారు. దీంతో గొంతు దగ్గర అన్నవాహిక సరిచేశారు. వైద్య బృందంలో కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ వై కిశోర్‌రెడ్డి, లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, పీడియాట్రిషన్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.