calender_icon.png 7 February, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా సోమ నరసయ్యను నియమించాలి

07-02-2025 12:00:00 AM

సూర్యాపేటటౌన్, ఫిబ్రవరి 6: సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి సోమ నరసయ్యను నియమించాలని సూర్యాపేట పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు కోరారు. గురువారం  పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను గౌరవించి జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.

సూర్యాపేట త్ డివిజన్ కు ప్రధాన కార్యదర్శి పదవిని కేటాయించకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో ఆ సంఘం సభ్యులు సింగిరికొండ రవీందర్, తోట శ్యాంప్రసాద్, తాటికొండ సీతయ్య, మీలా వంశీ, మంచాల రంగయ్య, కలకోట లక్ష్మయ్య, దేవరశెట్టి సత్యనారాయణ, పబ్బతి వేణుమాధవ్, వెంపటి పురుషోత్తం, రాచకొండ శ్రీనివాస్, వెంపటి శబరినాథ్, బిక్కు మల్ల కృష్ణ, గుండా శ్రీధర్, బెలిదేశ్రీనివాస్, వంగవీటి రమేష్, గుడుగుంట్ల విద్యాసాగర్ చల్లా లక్ష్మయ్య, వెంపటి రవితేజ, చింత వెంకన్న, మంచాల శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, శ్రీరంగం రాము, భాను తేజ, తప్సి అనిల్ కుమార్, బచ్చు పురుషోత్తం, పెనుగొండ మల్లికార్జున్ పాల్గొన్నారు.