calender_icon.png 19 April, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్వేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

16-04-2025 12:10:57 AM

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 15(విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్వేయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ కార్యాలయంలోని నియోజకవర్గానికి చెందిన నాయకులు,కార్యకర్తలు, కాలనీల సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారి ప్రాంతాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.అనంతరం క్రిష్ణ మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.అదే విధంగా పలు శుభ కార్యక్రమాల వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.