calender_icon.png 3 December, 2024 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనలో ప్రజా సమస్యల పరిష్కారం

21-11-2024 12:30:30 PM

రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఆర్ అండ్ ఆర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం 

గజ్వేల్ (విజయక్రాంతి ): సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజా సమస్యల ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సిద్దిపేట డిసిసి అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ సింగారంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ పథకాల ప్రచార రథంను గజ్వేల్ ఏఎంసి చైర్మన్  వంటేరు  నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి  ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అన్నారు. మొదటి నెలలోనే మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గృహ విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, వరుసగా రైతు రుణమాఫీ లను చేశారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతుందని ప్రజలు భావిస్తున్నారని, కానీ గత ప్రభుత్వం చేసిన  అనవసర అప్పులతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధిక మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రజలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్యాకేజీలు ఇచ్చామని కెసిఆర్,కేటీఆర్, హరీష్ రావులు  చెప్పుకుంటున్నారని, గత ఏడాదిగా ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నాయకులకు ముంపు గ్రామాల ప్రజల సమస్యలు అర్థమయ్యాన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగానే ఆర్ అండ్ ఆర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా నర్సారెడ్డి తెలిపారు.  వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారంతో పాటు మరింత అభివృద్ధి చేయనున్నట్లు  స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా వరంగల్,  వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు ప్రకటించి పనులు ప్రారంభించారని, గజ్వేల్లో కూడా ముంపు  గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న పథకాలను సాంస్కృతిక సారధి కళాకారులతో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఏం సి డైరెక్టర్లు  రమేష్ వహీద్, పార్టీ ప్రధాన కార్యదర్శి  నక్క రాముడు గౌడ్, నాయకులు శివారెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి,  శ్రీనివాస్, జహీర్, గ్రామ అధ్యక్షుడు రాములు, రమేష్ రుద్రారం సత్యనారాయణ, లష్కర్ సత్తయ్య, గోపాల్ రెడ్డి, నర్సింలు, సాంస్కృతిక సారధి కళాకారులు శ్యామ్,రవి, ప్రకాష్,కనకయ్య, బిక్షపతి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.