ఎస్పీ డివి శ్రీనివాసరావు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్పిడివి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో జిల్లాలోని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు, ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలన్నారు. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించడంతో పాటు పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఎందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నట్లు తెలిపారు.