calender_icon.png 22 April, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం

22-04-2025 01:36:42 AM

మానుకోట కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నీటికీ పరిష్కారం లభిస్తుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. భూభారతి చట్టం అమలుపై జిల్లాలోని కొత్తగూడా, గంగారం మండలాలకు చెందిన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రతి భూమి సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు ఎక్కడికక్కడే సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించే విధంగా గ్రామస్థాయిలో అధికారిని నియమించి నిర్దేశిత సమయంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, ఆర్డీవో కృష్ణవేణి, తహసిల్దార్లు రమాదేవి, సత్యనారాయణ, ఎంపీడీవోలు రవీంద్ర ప్రసాద్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.