కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులకు సంబంధించిన భూమి సమస్యలు త్వరలో అందుబాటులోకి రానున్న భూమాత ద్వారా పరిష్కారం అవుతాయని కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గం ఇంచార్జ్ రావి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలం కొత్మీర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ధరణిలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు దృష్టికి తీసుకురావడంతో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం ధరణిలో రైతులకు జరిగిన భూములకు సంబంధించి తప్పిదాలను గుర్తించి నూతనంగా రానున్న భూమాత ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ, రోడ్డు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇల్లు లేని అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, మాజీ ఎంపీపీ శంకర్, మాజీ సర్పంచ్ లు కృష్ణ మధుకర్ నాయకులు, వెంకటేష్, భీమయ్య, చందు, లింగన్న, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.