అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి
హుజూరాబాద్, అక్టోబరు 15: పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణ కేంద్రంలో వాకర్స్‌తో సమావేశమై పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. నిరుద్యోగులకు బాసటగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకనై పోరాడుతానని వెల్లడించారు.
కొంతమంది తనపై చేస్తున్న దుష్ప్రచారం కేవలం రాజకీయ విమర్శలేనని కొట్టి పారేశారు. విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించి నవ సమాజ నిర్మాణంతో భాగస్వాములు కావాలనే ఉద్దేశ ంతోనే తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు తీర్చడంతోపాటు వృత్తి నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.