అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి
హుజూరాబాద్, అక్టోబరు 6: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జమ్మికుంట మండల కేంద్రంలోని సాహితీ జూనియర్ కళాశాలలో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
యువతకు తన సొంత ఖర్చుతో వృత్తి నైపుణ్య కేం ద్రంతోపాటు పో టీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచిత శిక్షణతోపాటు లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాం డ్లు పీఆర్సీ అమలు, డీఏ పెంపు, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నరేందర్‌రెడ్డి తెలిపారు.