అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి
నిర్మల్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): తాను ఎమ్మెల్సీగా గెలిస్తే విద్యారంగ సమస్యలతో పాటు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, అందుకోసమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నానని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన విద్య అందడంలేదన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి పాటుపడుతానని చెప్పారు. విద్యారంగంపై పూర్తిగా ఆవగాహన ఉన్న తనకు పట్ట భద్రులు అవకాశం ఇవ్వాలని కోరారు.
నరేందర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అచీవర్ అవార్డు
కరీంనగర్, సెప్టెంబరు 20 (విజయక్రాంతి): అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్‌రెడ్డి ప్రతిష్టాత్మక యూనివర్సల్ ఐకాన్ అచీవర్ అవార్డు ఎంపికయ్యారు. శుక్రవారం అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్‌లో నరేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. అవార్డు రావడానికి కృషి చేసిన పరిపాలన విభాగం, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.