10-04-2025 02:21:00 AM
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): వయోవృద్ధుల సమస్యలను పరిష్కరిస్తానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలో తెలంగాణ వయోవృద్ధుల సంక్షేమ సంఘ ఆశ్రమ నూతన భవనాన్ని బుధవారం నాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వయో వృద్ధులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని ప్రభుత్వపరంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.