ఇటీవల విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆయా జిల్లా కేంద్రాలలో సభలు నిర్వహిస్తు న్నారు. ముఖ్యంగా విద్యారంగంలోని ప్రధాన సమస్యలపై వివిధ వర్గాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు తెలుస్తున్నది. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి, పరిష్కారాలపై సాధ్యాసాధ్యాలను చర్చిస్తున్నారు. అయితే, ఇలా జిల్లాల పర్యటనలు చేయడం, సమస్యలు గుర్తించడం, అధికారులతో చర్చిండం శుభ పరిణామమే. అలాగే, పనిలో పనిగా పాఠశాలల్లోని మౌలిక వసతులు కల్పనకు కూడా కృషి జరగాలి. స్కూళ్లలోని ఆయా కీలక సమస్యల పరిష్కారానికి కావలసిన నిధులను కూడా జాప్యం చేయకుండా ప్రభుత్వం మంజూరు చేయాలి.
అస్లాం షరీఫ్, శాంతినగర్