calender_icon.png 22 September, 2024 | 9:06 PM

గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

22-09-2024 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్‌జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌కుమార్‌రెడ్డి సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దిలీప్‌రెడ్డి ఆధ్వర్యంలో పీఆర్‌జీటీఏ నాయకులు శనివారం వేం నరేందర్‌రెడ్డిని కలిసి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలల్లో టైం టేబుల్ మార్పు, మిగిలి ఉన్న ఖాళీల్లో పదోన్నతులు, డిప్యూటేషన్లు, గ్రేడ్ 1 ప్రిన్సిపల్ పదోన్నతులు, 010 పద్దు ద్వారా జీతం, రెండో శనివారం సెలవు, నూతన డిగ్రీ కళాశాలల ఏర్పాటు, కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు, కామన్ బైలాస్ నిర్మాణం వంటి సమస్యలను వేం నరేందర్‌రెడ్డికి దృష్టికి తీసుకొచ్చారు. పీఆర్‌జీటీఏ జాయింట్ సెక్రటరీ నిర్మలానందం, ఆర్గనైజింగ్ సెక్రటరీ విద్యాసాగర్, బీసీ సొసైటీ విభాగం అధ్యక్షులు రమేశ్, మైనార్టీ సొసైటీ విభాగం అధ్యక్షుడు పానుగంటి విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు చెల్క సంజీవరెడ్డి పాల్గొన్నారు.