25-03-2025 04:35:38 PM
మునిపల్లి: ఆశ వర్కర్లల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించిన వారిని పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని తెలిపారు. మంగళవారం మునిపల్లి మండలంలో రోడ్డుపై ప్లే కార్డ్ తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు రమేష్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ పలు దపాల ఆందోళన చేసి పరిష్కరించనిచో నిన్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేయించి సమస్యను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల పట్ల మొండి వైఖరి ప్రదర్శించడం భావ్యం కాదని వెంటనే ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సంగీత, పద్మ, సునీత, పావని మంజుల, రాణి, జర్ణమ్మ, లలిత, రోషమ్మ, పుణ్యమ్మ, జయసుధ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.