గజ్వేల్, నవంబర్ 27 : తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన గజ్వేల్ పట్టణంలో పర్యటించారు. పలువురు ఉపా ధ్యాయులు, పట్టభద్రులను కలిశారు.
త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్‌తో పాటు బేసిక్ శాలరీ అమలుకు కృషి చేస్తానన్నారు. ఐఐటీ మొదటి సంవత్సరం పూర్తి చేయకున్నా విద్యార్థులు రెండో సంవత్సరం పాలిటెక్నిక్ చదివే విషయంపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తానన్నారు.