14-04-2025 01:05:27 AM
హయత్‌నగర్ కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 13 : హయత్ నగర్ డివిజన్ లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి తెలిపారు. డివిజన్ లోని వెంకటేశ్వర కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిన సంద ర్భంగా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం కార్పొరేటర్ ను సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ... కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. డివిజన్ లోని ప్రతి కాలనీని అభివృద్ధి చేయడం తన బాధ్యతని, నాలుగు సంవత్సరాల్లో హయత్ నగర్ డివిజన్ గణనీయంగా అభివృద్ధి చెందన్నారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీను, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి, సభ్యులు శేషు కుమార్, శేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆనంద్ చారి, చరణ్, అనిత, బీజేపీ నాయకుడు ఎర్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- సుభద్ర నగర్ కాలనీ
సంక్షేమ సంఘం సమావేశం
హయత్ నగర్ డివిజన్ లోని సుభద్ర నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆదివారం నిర్వహించిన సమావేశంలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి పన్ను చెల్లింపులపై కాలనీవా సులకు ఉన్న సందేహాలను కార్పొరేటర్, అధికారులు నివృత్తి చేశారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలో నిర్వహిస్తున్న జీఎస్‌ఐ సర్వే ఆధారంగానే ఇంటి పన్ను వసూలు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో అధికా రులు నాగయ్య, సుభద్ర కాలనీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ స్వామి, సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం, సోమిశెట్టి నారాయణ, అప్పారావు, నాగేశ్వరరావు, ఫణి కుమార్ పాల్గొన్నారు.