calender_icon.png 7 January, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు తీర్చండి.. వసతులు కల్పించండి

03-01-2025 12:00:00 AM

  1. ఆసిఫాబాద్‌లో మెడికల్ స్టూడెంట్స్ ఆందోళన
  2. అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): భవిష్యత్తులో వైద్యులు కావా ల్సిన వారు సమస్యల వలయంలో తమ చ దువులు కొనసాగించాల్సిన దుస్థితి కుమ్రం భీం ఆసిఫాబాద్ వైద్యకళాశాలలో నెలకొం ది. విద్య నేర్పే అధ్యాపకులు లేక.. వసతి భవనంలో మౌలిక వసతులు లేక సతమతమవు తున్నారు.

తమ సమస్యలను అధికారుల దృ ష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేక గురువా రం కళాశాల, ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. స్థానిక సీఐ రవీందర్ అక్కడికి చేరుకొని ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేసినా.. ససేమిరా అనడంతో ఆయన విషయాన్ని కలెక్టర్, ఎ స్పీ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో పలువురు వైద్య విద్యార్థులతో కలెక్టర్ వెంక టేశ్ దోత్రే భేటీ అ య్యారు. కళాశాల, వసతి భవనంలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసు కెళ్లారు. వాటి పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు.

అస్తవ్యస్తంగా వసతి..

రెండేళ్ల క్రితమే కాలేజీ ప్రారంభమైనా ఇప్పటికీ మౌలిక వసతులు పూర్తిగా కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. రెం డో ఏడాది చదువుతున్న విద్యార్థులకు కాలే జీ వద్దే వసతి కల్పించగా.. మొదటి సం వత్సరం చదువుతున్న బాలికలకు మార్కెట్ కమిటీ భవనంతో పాటు పాత కలెక్టరేట్ భవనాన్ని కేటాయించారు. బాలురకు రెండు చోట్ల వసతి ఏర్పాటు చేశారు.

20 మందికి పాత డీఆర్‌డీఓ కార్యాలయం వద్ద, 25 మందికి జిల్లా ఆసుపత్రి సమీపంలో భవనంలో వసతి కల్పించారు. బాలుర వసతి గృహంలో ఉన్న వారు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం టాయి లెట్స్ కూడా నీట్‌గా లేవని, కిటికీలకు మెస్‌డోర్ ఏర్పాటు చేయడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. కాలేజీకి వెళ్లేందుకు రవాణా కల్పించపోకవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. 

వేధిస్తున్న ఖాళీల కొరత..

కొమ్రం భీం మెడికల్ కాలేజీలో ఖాళీల కొరత వేధిస్తోంది. కాలేజేఈలో మొత్తం 27 మంది ప్రొఫెసర్లు ఉండగా కేవలం ఇద్దరే పనిచేస్తున్నారు. మొదటి సంవత్సరం విద్యా ర్థులకు బోధించేందుకు 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాల్సి ఉండగా కేవలం ఒక్కరే ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది.

ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బోధించేందుకు 58 మంది ప్రొఫెసర్లు కావాల్సి ఉండగా నలుగురే ఉన్నారు.ఈ పో స్టుల భర్తీకి ఇప్పటికే పలుసార్లు నోటిఫికేషన్ వేసినా.. జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని కళాశాల యాజమాన్యం చెబుతున్నారు. ఈ ఏడాది దాదాపు రెండు నెలల పాటు ఆన్‌లైన్‌లోనే క్లాసులు వింటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి ఫ్యాకల్టీని నియమించాలి

కాలేజీలో పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. విద్య బోధించేవారు లేకుంటే మేం ఎంబీబీఎస్ ఎలా పూర్తి చేస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి. మౌలిక వసతులు కూడా కల్పించాలి.                                 

ఎంబీబీఎస్ ఫస్టియర్