calender_icon.png 20 September, 2024 | 6:22 AM

సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలె

17-09-2024 03:16:01 AM

  1. విద్యావ్యవస్థ రోజురోజుకు పతనమవుతోంది 
  2. అగమ్యగోచరంగా 20 వేల పాఠశాలల పరిస్థితి 
  3. సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ 

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ర్టంలోని సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలకు- తక్షణ పరిష్కారం చూపాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. తొమ్మ ది నెలల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ పతనావస్థకు చేరుకున్నదని అన్నారు. పురుగులు లేని భోజనం కోసం, పాము కాట్లు, ఎలుక కాట్లు లేని వసతి కోసం, కనీస సౌకర్యాల కల్పన కోసం తరగతి గదుల్లో ఉండా ల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు చేపట్టే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 

ఒకవైపు టీచర్లు లేక బడులు మూతబడుతుంటే, మరోవైపు ప్రభుత్వ బడుల మీద విశ్వాసం సన్నగిల్లడంతో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కలే ఈ వాస్తవాలను చెబుతున్నాయని తెలిపా రు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 1,864 ఉంటే, 30లోపు విద్యార్థులున్న పాఠశాలలు 9,447, వందలోపు విద్యార్థులు పాఠశాలలు 9,609 ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 26,287 ప్రభుత్వ పాఠశాలలకుగాను దాదాపు 20 వేల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు.

అధ్వానంగా గురుకులాలు..

గురుకులాల పరిస్థితి మరింత అధ్వాన్నం గా మారిందన ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులాలు సమస్యలకు నిలయాలుగా మారా యని, వాటి దుస్థితి గురించి వార్తలు నిత్యకృత్యమైనా ఈ ప్రభుత్వానికి పట్టింపులేద న్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పటిష్టపరిచిన గురుకులాలను ప్రభుత్వం 9 నెలల్లోనే ధ్వం సం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షే మ హాస్టళ్లను సంక్షభ హాస్టళ్లుగా మార్చిందని మండిపడ్డారు.  పాఠశాల నుంచి కళాశాల వరకు ఏ హాస్టల్ చూసినా దుర్భర పరిస్థితులే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 715 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రుల పాలు కాగా, 40పైగా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభు త్వం పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు.న్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న పలు సమస్యలను ఈ సందర్భంగా ఆ లేఖలో వివరించారు.