calender_icon.png 19 April, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్కారీ శాఖలో సమస్యలు పరిష్కరించండి

18-04-2025 12:00:00 AM

కమిషనర్‌కు ఉద్యోగ సంఘాల వినతి 

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : అబ్కారీ శాఖలో  ఉద్యోగుల బదిలీలతో పాటు సమస్యలను కూడా పరిష్కరించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు ఉద్యోగ సంఘాల నాయకులు (టీజీవో) విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా  గురువారం టీజీవో సెంట్రల్ అసోషియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు అబ్కారీ భవన్‌లో కమిషనర్ హరికిరణ్, అడిషనల్ కమిషనర్ ఎస్‌వై ఖురేషిని కలిసి వినతిప త్రం అందజేశారు.

ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ల బదిలీలు గత 8 ఏళ్లుగా జరగ లేదని, జీవో 317 అమల్లో భాగంగా చాలా మంది దూర ప్రాంతాలకు బదిలీ చేశారని, వారిని తిరిగి తీసుకురావాలన్నారు. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.