29-04-2025 12:00:00 AM
నిర్మల్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరే ట్ సమావేశమందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాం తాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధర ణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి అంశాలపై ప్రజలు తమ సమస్యలను నివేదించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల ను నిర్ణీత గడువులో పరిష్కరించాలని, శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన దరఖాస్తులకు సంబంధించి వివరాలను రిమార్కుల విభాగంలో స్పష్టం గా నమోదు చేయాలని, దరఖాస్తుదారులకు పరిష్కారం గురించి సమాచారం అందించాలన్నారు.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో మారుమూల ప్రాంతాల ప్రజలకు సహాయార్థం ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా దరఖాస్తు లు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు పంపించి తక్షణమే పరిష్కారం చేపట్టాలని సూచించారు. దరఖాస్తు వివరాలను వాట్సప్ ద్వారా స్వీకరించి, సమస్య నమోదుకు సంబంధించిన రసీదులను దరఖాస్తుదారులకు పంపించారు.
ప్రజలు ఇంటి నుంచే 9100577132 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేసి, వాట్సప్ ద్వా రా దరఖాస్తులు పంపవచ్చని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖ ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.