- అంగన్‌వాడీల డిమాండ్
- ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీస్‌ల ఎదుట ధర్నా
మెదక్/యాదాద్రిభువనగిరి, జూలై 15(విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించా లని కోరుతూ సోమవారం అంగన్‌వాడీలు, ఆయాలు భువనగిరి, మెదక్ ఎమ్మెల్యేల క్యాం పు కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ప్ర యోజనాలను అందించాలని కోరారు. అంగన్‌వాడీ టీచర్లకు రూ.5లక్షలు, ఆయాలకు రూ.2లక్షల చొప్పున పదవీ విరమణ ప్రయోజనం అందించాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు, కార్యదర్శి కల్లూరి మల్లేశం, మాయ కృష్ణ, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిల్వేరి రమాకుమారి, నాయకులు రుక్మిణి, భాగ్య, భువనేశ్వరి, సునంద పాల్గొన్నారు. మెదక్‌లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బసవరాజ్, నాయకులు బాలమణి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.