calender_icon.png 16 November, 2024 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ సమస్యలు తీర్చండి

07-07-2024 12:00:00 AM

హైదరాబాద్ మహానగరంలో బోయిన పల్లి కూరగాయల మార్కెట్ దేశంలోనే అత్యంత పెద్దదిగా ఉన్నది. ఈ మార్కెట్‌కు దేశంలోని  వివిధ ప్రాంతాల నుండి కూరగాయలు ప్రతిరోజూ వస్తుంటాయి. ఈ మార్కెట్‌కు ఆనుకొని దాదాపు 100 మంది వ్యాపారులు కొంత స్థలాల్లో తాత్కాలిక షెడ్లు  నిర్మించుకొని చిల్లరగా కూరగాయల క్రయవిక్రయాలు నిర్వహిస్తుంటారు. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడం లేదు. దీనివల్ల కొనుగోలుదారులకు, అమ్మకం దారులకు చాలా ఇబ్బంది గా ఉంటోంది..  ఇంతేకాక ప్రతిరోజూ  ఉదయం పక్కనే ఉన్న పెద్ద మార్కెట్ నుండి ఈ షెడ్లకు ట్రాలీలు, సైకిల్ రిక్షాల ద్వారా కూరగాయలు సరఫరా చేస్తుంటారు.

చాలా ఇరుకు రోడ్డు ఉండడం వల్ల  వాహనదారులతో పాటు  వ్యాపారస్తులు తీవ్రమైన  ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. నగరంలో చాలా చోట్ల కూడా  ఆధునికంగా కూరగాయల మార్కెట్లు నిర్మించి నిర్వహణ చేస్తున్నారు కానీ ప్రధానమైన బోయినపల్లి మార్కెట్ పక్కనే ఉన్న ఈ చిల్లర మార్కెట్‌ను విస్మరించారు. కనీసం మూత్రశాలలు కూడా లేకపోవడంతో ముఖ్యం గా స్త్రీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  సత్వరమే ఈ తాత్కాలిక షెడ్ల స్థానంలో శాశ్వత  ప్రాతిపదికన ఆధునిక సదుపాయాలతో మార్కెట్  నిర్మించాలని వ్యాపారస్తులు, కొనుగోలుదా రులు కోరుతున్నారు.

 దండంరాజు రాంచందర్ రావు, పాత బోయినపల్లి