కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారయణపేట,అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారా నికి లెవెల్ 1, లెవెల్ 2 స్థాయిలో అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సిక్తా పట్నా యక్ ఆదేశించారు. మద్దూర్, కోస్గి మండలలోని రెణివట్ల, కడంపల్లి గ్రామాల్లో కలెక్టర్ గురువారం పర్యటించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. లెవెల్ 1 స్థాయిలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు క్ష్రేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు.
బఫర్ జోన్‌కు 30 మీటర్ల దూరంలో ఉన్న ప్లాట్లను రెగ్యులర్ చేయాలని చెప్పారు. ఒక వేళ బఫర్ జోన్ పరిధిలో ఉంటే తిరస్కరించాలని సూచించారు. లెవెల్ 2 స్థాయిలో ఉంటే ఎంపీవోలు, ఎంపీడీవోలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మద్దుర్ మండలంలోని రెణివట్లలో 407, కోస్గి మండలంలోని కడంపల్లిలో 57 పెండింగ్ ఎల్‌ఆర్‌ఎస్‌లు ఉన్నాయని అధికకారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.