calender_icon.png 25 November, 2024 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమ్మరివాడిలో అక్రమాలు తేల్చండి

27-10-2024 02:19:59 AM

జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ కుమ్మరివాడిలో అక్రమ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న చర్యలపై హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు నివేదిక అందజేయాలని ఆదే శించింది.

తన పూర్వీకుల నుంచి వచ్చిన 426 చదరపు గజాల ఆస్తిలోని నిర్మాణాలు చేపట్టొద్దని జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ మహ్మద్ అబ్దుల్ ముబీన్ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపి స్తూ.. ఆ ప్రాంతంలో అనేక అనధికార నిర్మాణాలు ఉన్నాయని, వాటిపై ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ అధికారులు ఏనాడూ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

అక్రమ నిర్మాణాలపై స్పందించని జీహెచ్‌ఎంసీ తన నిర్మాణాలను అడ్డుకునేలా నోటీసులు ఇవ్వ డం విడ్డూరంగా ఉందని వాదించారు. కుమ్మరివాడిలో 350కిపైగా నిర్మాణాలు అనధికారమైనవేనని చెప్పారు. కార్పొరేటర్ ఆదేశాలతోనే జీహెచ్‌ఎంసీ సిబ్బంది పిటిషనర్‌కు నోటీసులు జారీ చేశారని అనుమా నం వ్యక్తంచేశారు. వాదనల తర్వాత కుమ్మరివాడిలో అక్రమ నిర్మాణాలు పరిశీలించా లని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించిం ది. విచారణ వచ్చేనెలకు వాయిదా వేసింది.