04-04-2025 11:08:25 PM
ఖమ్మం,(విజయక్రాంతి): కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముజ్ మీల్ ఖాన్ ని కలుసుకొని ఎండాకాలం దృష్ట్యా సత్తుపల్లి నియోజకవర్గం లో నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా నూతన బోర్లు, రిపేర్ లు ఉన్న మోటర్లు గుర్తించి నీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సత్తుపల్లి నియోజకవర్గం లో సత్తుపల్లి, కల్లూరు లో షాదీఖానా నిర్మాణ పనులు, ఖబరిస్తాన్ చుట్టూ గోడ నిర్మాణాలు, పలు మసీద్ లో సమస్యలు పరిష్కరించాలని. నియోజకవర్గం లో పలు అభివృద్ధి, సమస్యలు గురించి కలెక్టర్ తో చర్చించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్.