calender_icon.png 16 April, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగు నీటి సమస్యలను పరిష్కరించండి

16-04-2025 12:00:00 AM

ఐటీడీఏ పీవో ఆదివాసీల వినతి

ఉట్నూర్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): ఎం డా కాలంలో జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో త్రాగు నీటి సమస్య  ఆదివాసీలను తీవ్రంగా పీడిస్తుందని ఆదివాసీలు వాపోయారు. గాదిగూడ, ఇంద్రవెల్లి మండలాల్లోని బొజ్జు గూడ, మోకాశి గూడ, పర్సవాడ (బి), మామిడి గూడ (బి) గ్రామాల్లో త్రాగు నీటి సమస్య పరిష్కరించాలని మంగళవారం ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తాను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సభ్యులు కలిసి విన్నవించారు.

భూగర్భ జలాలు ఎండిపోయి చేతి పంపులలో నీరు రాకపోవడంతో తాత్కాలికంగా ఇతరుల వ్యవసాయ బోర్ల నుండి నీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు. ఆయా గ్రామాల్లో భూగర్భ జలా లపై సర్వే చేయించి నీటి సౌకర్యం కల్పించడానికి బోర్లు మంజూరు చేయాలని కోరా రు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోట్నక్ సక్కు, గ్రామస్తులు పంద్ర నగేష్, లచ్చు, కోట్నక్ లింగు, కుమ్ర విలాస్ తదితరులు ఉన్నారు.