22-04-2025 06:00:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబరి గంగాధర్ అన్నారు. మంగళవారం నిర్మల్ మండలంలోని ముజుకి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భూభారతి గ్రామసభను నిర్వహించి మాట్లాడారు. గతంలో అమలు చేసిన ధరణి కారణంగా చాలా గ్రామాల్లో భూ వివాదాలు ఏర్పడి రైతులు ఇబ్బంది గురయ్యారని రైతులకు పక్కాగా భూ సమాచారాన్ని అందించి ఇచ్చేందుకు భూభారతి అమలు అవుతుందని దాన్ని సద్విని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ విజయ్ కుమార్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.