calender_icon.png 19 April, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

40 ఏళ్ల చిరకాల సమస్యకు పరిష్కారం

07-04-2025 12:42:18 AM

ఎమ్మెల్యే కు కృతజ్ఞతలను తెలిపిన గ్రామస్థులు

కామారెడ్డి, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి), గత నలభై సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామస్తులు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గెలిచే ఎమ్మెల్యేలకు స్థానిక మండల ప్రజా ప్రతినిధులకు, గ్రామానికి వచ్చే అధికారులకు రోడ్డు సమస్య గురించి విన్నవించారు. రోడ్డు సమస్య గ్రామస్తులు చెప్తే విన్నారే తప్ప పరిష్కారం చూపించలేకపోయారు.

శ్రీరామ నవమి సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు గత కొద్దిరోజులుగా రోడ్డు సమస్య గురించి గత నలభై సంవత్సరాలుగా పడుతున్నా ఇబ్బందుల గురించి గ్రామస్తులు వివరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం రామ లక్ష్మణ్ పల్లి గ్రామస్తులు రోడ్డు నిర్మాణం కోసం గత 40 సంవత్సరాలుగా విన్నవిస్తున్న సమస్య పరిష్కారం కాలేదు.

దివారం శ్రీరామనవమి వేడుకలకు వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గ్రామస్తుల చిరకాల సమస్య కు  రూ.25 లక్షల నిధులు మంజూరు చేశారు. ఒకేసారి గ్రామస్తులు ఆచర్య శక్తులయ్యారు. తాము గత 40 సంవత్సరాల నుంచి రోడ్డు కోసం ప్రాధేయపడ్డ సమస్య పరిష్కారం కాలేదని సీతారామ ల కళ్యాణానికి వచ్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రోడ్డు సమస్యను పరిష్కరిస్తూ నిధులు మంజూరు చేయడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్మోహన్రావు కు కృతజ్ఞతలు తెలిపారు.

తమ నలభై సంవత్సరాల సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందరో ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు కానీ తమ రోడ్డు సమస్య పరిష్కారం కాలేదని శ్రీరామ నవమి సందర్భంగా తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమస్యను పరిష్కారం ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు.