24-04-2025 07:30:07 PM
కల్లూరు (విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ కేంద్రం నుండి మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్(MLA Matta Ragamayee Dayanand), రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గావ్ లో మంగళవారం అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన పాశవిక ఉగ్రదాడికి గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సత్తుపల్లి బయులుదేరాయి.
ఈ సందర్భంగా కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ... పాకిస్థాన్ ఉగ్రవాదులను తీవ్రంగా శిక్షించి, భారతదేశం ధీటైన సమాధానం ఇస్తుందని ఇలాంటి దాడులను భారతదేశం సహించబోదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు బాగం ప్రభాకర్ చౌదరి, ధారా రంగా, ఆళ్లకుంట నరసింహారావు, పసుపు లేటి శ్రీనివాస్ రావు, నల్లగట్ల కిషోర్, చిలక మునిబాబు, మండలం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.