కళా విభాగం రాష్ట్ర కన్వీనర్ శంకర్
కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సమరసతా సాహిత్యంతో ఐకమత్యం సాధిద్దామని సామాజిక సమరసతా వేదిక కళా విభాగం రాష్ట్ర కన్వీనర్ బండిరాజుల శంకర్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలో నిర్వహించిన సమరసతా మూర్తులు దున్న ఇద్దాసు, గుర్రం జాషువా, బోయి భీమన్న, చిలకమర్తి లక్ష్మీనర్సింహం జయంతి, కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
కవులు సమాజహితం కోరే సాహిత్యాన్ని రాయాలని కోరారు. మహనీయుల స్ఫూర్తితో సామాజిక సమరసతకు నడుం బిగించాలని కోరారు. కవితలు సజీవ సాదృశ్యంగా ఉండాలని యాదాద్రి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొరెడ్డి రంగయ్య అన్నారు.
కార్యక్రమంలో తెలుగు లెక్చరర్ సామల కిరణ్, అష్టావధాని బండకాడి అంజయ్యగౌడ్, విభాగ్ సహ సంయోజకుడు సంగన్నగారి బాల్‌రాజ్‌గౌడ్, గౌరవ అధ్యక్షుడు తమ్మ రాంచంద్రం, సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షుడు అమృత రాజేందర్, జిల్లా సంయోజకులు భూంరెడ్డి, భూంపల్లి భూపాల్, జంగంప్రశాంత్, దత్తురావు, సంగిరాజేందర్, బాలకృష్ణ, తాటిపాముల రాజేంద్రప్రసాద్, కృష్ణామూర్తి, చౌకిరాజేందర్, ఆస రాజేశ్వర్, పరమేష్ పాల్గొన్నారు.