03-03-2025 10:12:43 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో సంకష్ట హర గణపతి ఆలయంలో సోమవారం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞం సంపత్ కుమార్ శర్మ రమాకాంత్ శర్మ పవన్ శర్మ వంశీ శర్మ అరవింద్ భరద్వాజ్ సతీష్ పాండే ల ఆధ్వర్యంలో పల్గనశుద్ధి చతుర్థి సంతత చతుర్థిని ఘనంగా నిర్వహించారు. సామూహికంగా యాగాలను నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇదే రోజున పుత్ర కామేష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ యజ్ఞంలో పుత్రులు కావాలని కోరుకునే దంపతులు పాల్గొని నియమ నిబంధనలు పాటించాలన్నారు. 121 దంపతులు ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న అట్లు వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సుతారి అంజయ్య , ప్రధాన కార్యదర్శి బొంబోతుల రవీందర్ గౌడ్, కోశాధికారి విశ్వం గుప్తా కార్యవర్గ సభ్యులు భవాని గ్రహ మండలేశ్వర సేవా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.