calender_icon.png 27 September, 2024 | 12:55 PM

మూడు రోజులు మంచులో జవాన్లు

20-09-2024 01:53:57 AM

కాపాడిన ఆర్మీ రెస్క్యూ టీం

ఢిల్లీ, సెప్టెంబర్ 19:  ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో భారత్ సరిహద్దుల్లో ౩రోజుల పాటు మంచు లో చిక్కుకుపోయిన జవాన్‌ను ఆర్మీ రెస్క్యూ టీం కాపాడింది. బీహార్‌లోని బక్సర్‌కు చెందిన అనిల్‌రామ్ ఐటీబీపీ బృందంలో పనిచేస్తున్నారు. ఈ క్రమం లో ఉత్తరాఖండ్‌లోని చైనా సరిహద్దు లో మున్స్‌యారీేొమిలామ్‌కు 80 కి.మీ. దూరంలోని ప్రదేశంలో పోర్టర్ దేవంద్రసింగ్‌తో కలిసి అనిల్ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో మంచు విపరీ తంగా కురవడంతో దారి మూసుకుపోయింది.

దీంతో చలి నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గరలోనే ఉన్న ఓ గుహలో తలదాచుకు న్నారు. అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ వారిని కాపాడడానికి  ప్రయత్నాలు మొదలుపెట్టింది. ౩రోజుల తరువాత వారు కనబడ్డారు. నాలుగు అడుగుల మేర కూరుకుపోయిన మంచులో వెళ్లి వారిద్దరిని కాపాడి గుహ నుంచి బయటకు తీసుకువచ్చి హాస్పిటల్‌లో చేర్పిం చారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా తమను కాపాడిన రెస్క్యూ టీంకు వారు కృతజ్ఞతలు తెలిపారు.