04-04-2025 12:21:16 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, ఏప్రిల్ 3(విజయ క్రాంతి):ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనతో మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో రెడ్కో జిల్లా మేనేజర్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, ఎల్ డి ఎం నరసింహమూర్తి, ఎస్ సి ట్రాన్స్కో శంకర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం-మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించే ప్రక్రియ కోసం జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయబడిందన్నారు. పీఎం ఎస్ జి కింద మార్గదర్శకాలలో వివరించిన విధంగా, మోడల్ సోలార్ విలేజ్ కాంపోనెంట్ను సజావుగా అమలు చేయడానికి జిల్లా స్థాయి కమిటీ చర్చించి తద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
5,000 మంది పాపులేషన్ ఉన్న గ్రామపంచాయతీని గుర్తించి, ఆ గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ పవర్ ఏర్పాటు చేయడంతో పాటు, వీధిలైట్లు కూడా సోలార్ తో వెలిగే విధంగా చూడటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన అనేదిభారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 15, 2024న ప్రారంభించారు. ఈ పథకం కింద, గృహాలకు వారి పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీని అందిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.