calender_icon.png 23 January, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగంగా ఎస్‌హెచ్‌జీలకు సౌర విద్యుత్తు ప్రాజెక్టు

22-01-2025 01:32:08 AM

సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) 1000 మెగావాట్ల సౌర విద్యు త్తు ప్లాంట్లను కేటాయించి, ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని విద్యుత్తుశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. మంగ ళవారం సచివాలయంలో ఎస్‌హెచ్‌జీలకు సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

స్వయం సహాయక సంఘాలు ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగాయో వివరించారు. ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రాజెక్టుతో ఎస్‌హెచ్‌జీలు రూ.కోట్లు విలువైన ప్రాజెక్టులను కూడా అలవోకగా నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఎస్‌హెచ్‌జీలు చేపట్టే సౌరశక్తి ప్రాజె క్టులకు అన్ని శాఖలు పూర్తిగా సహకరించాలని చెప్పారు. ఎస్‌హెచ్‌జీలకు భూమి కేటా యింపుల నుంచి మొదలుకుని, ఆర్థిక, సాంకేతిక సహకారం వరకు అన్ని రకాలుగా అం డగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని ఎస్‌బీఐ అధికారులు ప్రశంసిం చారు. ఆర్థిక పరమైన సాధ్యాసాధ్యాలపై ఎస్‌హెచ్‌జీలకు తమ సహకారం అందిస్తా మన్నారు. ప్రాప్తి పోర్టల్ ద్వారా సౌరశక్తి ఉత్పత్తి ప్లాంట్లకు ఎప్పటికప్పుడు నిధులు అందిస్తామని ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ హామీ ఇచ్చారు.

టెండరు ప్రక్రియ, ప్లాం ట్ల నిర్మాణ వెండర్ల ఎంపిక పూర్తయ్యిందని, తమ సంస్థ నుంచి ఎస్‌హెచ్‌జీలకు పూర్తిస్థాయి సాంకేతిక శిక్షణ అందిస్తామని టీజీరె డ్కో వీసీ ఎండీ అనిల తెలిపారు. సమావేశంలో పీఆర్, ఆర్డీ సెక్రటరీ లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్య, స్త్రీనిధి బ్యాంకు, ఎస్‌బీఐ జీఎం, ఎంపికైన వెండర్లు పాల్గొన్నారు.

ఆర్వోఎఫ్‌ఆర్ భూముల్లో సోలార్ మోటర్లు!

ఆర్వోఎఫ్‌ఆర్ కింద గుర్తించిన గిరిజనుల భూముల్లో సోలార్ మోటర్లను ఏర్పాటు చేయనున్నట్టు, మొదటి విడతలో 50 వేల మంది గిరిజన లబ్ధిదారులకు ఈ అవకాశాన్ని కల్పించనున్నట్టు విద్యుత్తు శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్ కింద మొత్తం 2.5 లక్షల సోలార్ పంపులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని..

ఇందులో భాగంగా మొదటి విడతలో 50 వేల మంది గిరిజన లబ్ధిదారులకు సౌర విద్యుత్తు పంపులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సమగ్ర ప్రాథమిక సర్వే చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ఎంత అవసరం, ప్రణాళిక తదితర అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. గిరిజన సంక్షేమం, ఫారెస్ట్, రెడ్కోలు సంయుక్తంగా ఈ పథకాన్ని పర్యవేక్షిస్తూ అమలు చేయాలని నిర్ణయించారు.