25 May, 2026 | 2:39 AM

గాలివాన బీభత్సం.. అపార నష్టం

25-05-2026 01:57 AM

బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో చెల్లా చెదిరైన సోలార్ ప్యానల్స్ 

నీరుల పారిన వారి ధాన్యం.. కన్నీటి పర్వతమైన రైతన్నలు 

మహబూబ్ నగర్, మే 24 (విజయ క్రాంతి)/జడ్చర్ల : అకాల వర్షాలకు అపార నష్టం వాటిల్లుతుంది. వివిధ వ్యాపార సముదాయాల నిర్వహణలో ఏర్పాటుచేసిన వివిధ షెడ్లు కూలిపోగా, రోడ్లపై చెట్లు విరిగిపడగా రాకపోకలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జడ్చర్ల నుండి డిగ్రీ కళాశాలలో సోలార్ ప్యానల్ గాలి వాన బీభత్సానికి చెల్లా చెదురు కావడం తీవ్ర నష్టానికి దారితీసింది. బారి చెట్లు సైతం విరిగి నేలకొరిగాయి. 

కన్నీటి పర్వతమవుతున్న రైతులు..

వరి ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో రైతులకు ఊహించని రీతిలో వస్తున్న వర్షాలకు నీరుల వరి ధాన్యం మారుతుంది. ఎంతో చెమట ఓడ్చి శ్రమించి పండించిన ధన్యం కళ్ళముందే వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే కాపాడలేని స్థితిలో ఉండి కన్నీటి రైతులు పర్వతమవుతున్నారు. అధికార యంత్రాంగం వేగంగా కొనుగోలు చేస్తున్నామని బయటికి చెబుతున్నప్పటికీ ధాన్యం అంత వేగంగా తరలింపు జరగడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పండించే సమయంలో యూరియా కోసం పండించిన తర్వాత విక్రయం కోసం పడిగాపులు కాయడమేంటని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.