calender_icon.png 16 January, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో 89 వేల సర్కారు బడుల్లో సోలార్ ప్యానళ్లు

16-01-2025 01:33:06 AM

తెలంగాణలో సోలార్ ప్యానళ్లు కలిగిన స్కూళ్లు 2598

హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాం తి): దేశవ్యాప్తంగా పాఠశాలల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. పాఠశాలల అవసరాలకు అనుగు ణంగా వీటి ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 10.5 శాతం స్కూళ్లలో సోలా ర్ ప్యానళ్లు ఏర్పాటు చేసినట్టు ఇటీవల కేం ద్రం విడుదల చేసిన యూడైస్ ప్లస్ 2023 నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశా లలతోపాటు ఇతర స్కూళ్లన్నీ కలిపి మొత్తం 14,71,891 పాఠశాలలు ఉన్నాయి.

అందు లో 1,54,498 పాఠశాలల్లో సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. అలాగే 89,746 సర్కారు బడులు, 9059 ఎయిడెడ్, 50,767 ప్రైవేట్, 4926 ఇతర స్కూళ్లలో సోలార్ ప్యానళ్లు ఉన్నాయి. ఇక తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ మొత్తం స్కూళ్లు 42,901 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ స్కూళ్లు 30,022 కాగా, ఎయిడెడ్ స్కూళ్లు 662, ప్రైవేట్ స్కూళ్లు 12,126 ఉండగా, ఇతరత్రా స్కూళ్లు మరో 91 ఉన్నాయి. అయితే మొత్తం 2,598 (6.1శాతం) స్కూళ్లలో మాత్రమే సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు.

సోలార్ ప్యానళ్లు కలిగిన ప్రభుత్వ స్కూళ్లు కేవలం 1671 మాత్రమే ఉండగా, ఎయిడెడ్ 31, ప్రైవేట్ 893, ఇతర స్కూళ్లు మూడున్నాయి. చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ ఈ విషయంలో వెనుకవరుసలో ఉంది. ఛండీగడ్ రాష్ట్రంలో సోలార్ ప్యానళ్లు ఉన్న స్కూళ్లు 75.2 శాతం, ఢిల్లీ 33.4 శాతం హర్యానా 22.3 శాతం, పంజాబ్ 20 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 13.6 శాతం, నాగాలాండ్ 14.3 శాతం, ఓడిస్సా 14.4 శాతం సిక్కిం 13.1 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 11.7 శాతం, ఉత్తరఖండ్ 8.5 శాతం, రాజస్థాన్‌లో 8.2 శాతం, బీహార్‌లో 9.2 శాతంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు మనకంటే ముందు వరుసలో ఉంటే, మరికొన్ని రాష్ట్రాలు మనకంటే వెనుక వరుసలో ఉన్నాయి.