19-03-2025 11:48:03 PM
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నగరానికి చెందిన అకార్డియన్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అకృతి నిమ్స్ ఆసుపత్రికి నిర్మాణ్ ఎన్జీఓ ద్వారా రూ.20 లక్షల విలువ చేసే సోలార్ ప్యానల్స్ ను విరాళంగా అందచేశారు. అకార్డ్, నిర్మాన్ సంయుక్తంగా నిమ్స్‌లోని డయాలసిస్ కేంద్రానికి సౌర విద్యుత్తును అందించే ‘ప్రాజెక్ట్ గ్రీన్ డయాలసిస్ ఇనిషియేటివ్‘ అనే సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేసారు. ఇది 50 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర వ్యవస్థ. రోజుకు 200 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. దీంతో నెలకు రూ.65000 ఆదా అవుతుంది. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ నగరి భీరప్ప పాల్గొని మాట్లాడుతూ... ఈ సోలార్ పవర్ వలన ఎంతో విద్యుత్ ఆదా కావడమే కాకుండా డయాలసిస్ రోగులకు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలందించవచ్చన్నారు. దాతలను ప్రతేకంగా అభినందించారు. నెఫ్రాలజీ ప్రొఫెసర్లు డా. భూషణ్ రాజు, డా. గంగాధర్, డా. స్వర్ణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డా. చరణ్, డా. రాకేష్, ఆర్ మ్ ఓ హేమంత్ పాల్గొన్నారు.