మరో అద్భుతానికి అడుగులు
బీజింగ్, జనవరి 1: చైనా సిగలో మరో అద్భుతమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్నది. ఇన్నర్ మంగోలియాలోకి కబుకీ ఎడారిలో 400 కి.మీ పొడవు, 5 కి.మీ వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ వాల్ నిర్మిస్తున్నది. ప్రాజెక్ట్ నుంచి సుమారు 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని పెట్టుకున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే 5.4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా ప్యానల్స్ అమర్చింది.
ఎడారిలో అత్యధిక ఉష్ణోగ్రతలు, చదునైన భూతలం, దగ్గర్లోనే పారిశ్రామిక ప్రాంతాలు ఉండడం సోలార్ ప్రాజెక్ట్‌కు కలిసి వచ్చే అంశాలు. బీజింగ్‌లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఆ అవసరాలు తీర్చేందుకు ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రాజెక్ట్‌పై నాసా ఎర్త్ అబ్జర్వేటరీ స్పందిస్తూ.. ‘సోలార్ ప్రాజెక్ట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్యానళ్ల కారణంగా ఎడారి ఫొటోవాల్టిక్ సముద్రంగా మారింది. శాటిలైట్ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి’ అని హర్షం వ్యక్తం చేసింది.