calender_icon.png 27 February, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ స్కీం: మంత్రి తుమ్మల

18-02-2025 06:15:45 PM

హైదరాబాద్: పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ స్కీం ప్రవేశపెట్టే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. పామాయిల్ తో పాటు ఇతర పంటలకు బిందు, తుంపర సేద్య పరికరాలు అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. కూరగాయల సాగు పెంపునకు సెమీ అర్బన్ క్లస్టర్లు( Semi Urban Cluster) ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జూన్ మొదటి వారంలోపు మరో ఆయిల్ పామ్ కర్మాగారం అందుబాటులోకి తెస్తామన్న మంత్రి తుమ్మల మరో రెండు ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ఆరంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి చూపని ఆయిల్ పామ్ కంపెనీల(Oil palm companies)పై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ పామ్ కంపెనీ(Vishwatej Oil Palm Company) అనుమతులు రద్దు చేశామని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.