19-02-2025 01:44:29 AM
* వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
* ఉద్యానశాఖ అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కోతులు, మేకలు, వన్యప్రాణుల నుంచి ఉద్యాన పంటలను రక్షించుకునేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం రాష్ట్ర ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే సోలా ర్ ఫెన్సింగ్ విధానం అమలులో ఉందని, అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులకు రాయితీపై సోలార్ ఫెన్సింగ్ సామగ్రి అం దించాలన్నారు. హైదరాబాద్‌కు 100 కి.మీలోపు కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు. మార్చి నెలాఖరు లోపు ఆయిల్‌పామ్ విస్తరణ లక్ష్యాల ను అధిగమించాలని, పురోగతి సాధించని కంపెనీలకు నోటీసులు జారీ చేయాలన్నారు. విశ్వ తేజ కంపెనీ అనుమతులు రద్దుచేసి హిందుస్థాన్ యూనిలివర్‌కు అప్పగించామన్నారు.