calender_icon.png 12 January, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శోక రాహిత్యమే గీతా సిద్ధాంతం

05-07-2024 02:30:00 AM

శ్రీకృష్ణుని ముఖతః వెలువడిన భగవద్గీతను అర్జునునితోపాటు ఆ రథం టెక్కెంపై కూర్చున్న హనుమంతుడు, వ్యాసులవారు, వ్యాసులవారి అనుగ్రహంతో సంజయుడు మొత్తం నలుగురు నేరుగా విన్నారు. అర్జునునకు కలిగిన అజ్ఞాన సమ్మోహం గీతను ఆసాంతం విన్న తర్వాత తొలగిపోయిందని సామాన్యంగా అందరం  భావిస్తాం. అందుకు ‘నష్టో మోహః.. స్మృతిర్లబ్ధా... ’ అనే (18 గీతా శ్లోకాన్ని ఉదహరిస్తారు. కానీ, గీత 11వ అధ్యాయం ప్రారంభం(11 అర్జునుడు ఇలా అంటాడు, “మహాత్మా! ఎంతో అనుగ్రహంతో మీరు బోధించిన అతి రహస్యమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల నాలోని అజ్ఞానం తొలగిపోయింది.” అంటే, అర్జునుని మోహభ్రాంతి గీతను దాదాపు సగం విన్నప్పుడే తొలగి పోయినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. 

గీతా గ్రంథం మనిషిని ‘త్యాగివి కమ్మని’ బోధిస్తున్నది. ‘అశోచ్యాన్’ (2- శ్లోకంతో శ్రీకృష్ణుని బోధ ప్రారంభమై, మధ్యలో ‘నత్వం శోచితు మర్హసి’ (2 వంటి హెచ్చరికలతోకూడి, తుట్టతుదకు ‘మాశూ చః’ (18- వాక్యంతో పరిసమాప్తమైంది. కనుక, ‘శోక రాహిత్యమే గీతా ముఖ్య సిద్ధాంతం’గా తెలుస్తున్నది. గీతలోని శ్లోకాలు 700లు. 13వ అధ్యాయం ప్రారంభంలోని అర్జునుని ప్రశ్న అయిన ‘ప్రకృతిం పురుషం చేవ’ (13 శ్లోకాన్ని కూడా కలిపితే ఆ సంఖ్య 701 అవుతుంది. 

‘గీతా జయంతి’ విశేషం

గీతను రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు బోధించిన దినం మార్గశిర శుద్ధ ఏకాదశి. అది గీత జన్మదినం. ఆ దినమే గీతా జయంతి. గీతను మొదట ప్రచారం చేసిన వారు సంజయుడు. గీత ‘ధ’ కారంతో ప్రారంభమై ‘మ’ కారంతో అంతమైంది. ‘ధ, మ’ అనే రెండు అక్షరాల మధ్యే గీత అంతా సాగింది. ‘మూర్తీభవించిన ధర్మమే గీత’ అనడానికి ఇదే తార్కాణం. నొసటి రాతను తుడిచి వేసి జీవునకు కర్మాతీత, జ్ఞానాతీత కైవల్య పదవిని కలిగించే అఖండ శక్తి గీతకు వుం దని మనం అర్థం చేసుకోవాలి.

‘మహాభారతం’లో గీతస్థానం భీష్మపర్వంలో 25వ అధ్యాయం మొదలుకొని 42వ అధ్యాయం వరకు వుంది. గొప్పగొప్ప సంస్కృత గ్రంథాలు ‘అథ’ అనే మంగళవాచ కంతో- ప్రారంభమై ‘ఇతి’ అనే మంగళ వాచకంతో ముగుస్తాయి. గీతలోనూ ప్రారంభ ఘట్టంలో ‘అథ వ్యవస్థితాన్ దృష్ట్యా’ వ్యాఖ్యలో ‘అథ’, అంతిమ ఘట్టంలోని ‘ఇతి గుహ్యతమం శాస్త్రం’ వాక్యంలో ‘ఇతి’ పదాలు వున్నాయి.

శ్రీకృష్ణుని అవతార కాలం (ఉపాధి వయస్సు) 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 ఘడియ లు. గీతను బోధించే సమయంలో శ్రీకృష్ణుని వయ స్సు దాదాపు 87 సంవత్సరాలు. ‘యేన సర్వమిదం తతమ్’ వాక్యం గీతలో మూడుసార్లు (2- (8 (18 ప్రయోగితమైంది. ‘ఎవ్వనిచే ఈ సమస్త జగత్తు వ్యాపింపబడి వుందో ఆ పరమాత్మ’ అని దాని అర్థం. ‘మన్మనా భవ మద్భక్తో, మధ్యాజీ మాం నమస్కురు’ అనే వాక్యం గీతలో రెండుసార్లు ప్రయోగితమైంది (9- (18 “నా యందే మనసు నిలుపు. నా భక్తుడవు కమ్ము, నన్నే అర్చింపుము, నాకు నమస్కరింపుము” అని దీని అర్థం.

గీతలో బ్రహ్మజ్ఞానం

గీత ప్రభావం గురించి ‘స్కాంద పురాణం’లో ఉంది. దాన్నే శ్రీకృష్ణుడు తెలిపాడు. ‘గీతా శాస్త్రం సమస్తశాస్త్రాల ద్వారా చక్కగా నిశ్చయింపబడిన సిద్ధాం తాలను కలిగి వున్నది. వేదశాస్త్ర సునిశ్చితమైన బ్రహ్మజ్ఞానం విరాజమానమై వుంది. ఈ గీతాశాస్త్ర రహ స్యాలు, వేదార్థాలు అద్దంలో వలె ప్రతిబింబిస్తాయి. ప్రయత్న పూర్వకంగా పఠించిన వారు ఎవరైనా విష్ణు సన్నిధిని పొందుతారు. ఈ గీతాశాస్త్రాన్ని చదివినవారి లేదా విన్నవారి పుణ్యం వృద్ధి చెందుతుంది. పాపం హరిస్తుంది. 18 పురాణాలను, 9 వ్యాకరణాలను, 4 వేదాలను బాగా మధించి వ్యాసులవారు మహాభారతాన్ని రచించాడు.

దీనినంతా మధించిన ఫలితంగానే ‘భగవద్గీత’ రూపొందింది. ఇందులోని సారాన్ని శ్రీకృష్ణుడు అర్జునుని ముందు సాక్షాత్కరింప చేశాడు. ప్రతి దినం జల స్నానంతో మన శరీర మాలిన్యం ఎలాగైతే పోతుందో, అలాగే ‘గీతాశాస్త్ర’ జలంలో ఒకసారి స్నానం చేస్తే సంసార మాలిన్యమంతా తొలగిపోతుంది. అందుకే, గీత సర్వవేద పరిపూర్ణ రూపిణి. మనువు సర్వధర్మమయుడు. గంగ సర్వతీర్థ పరిపూర్ణ. అలాగే, విష్ణువు సర్వదేవమయుడు. గీతలోని ఒక్క శ్లోకం గాని, అర్థ శ్లోకం గాని, కనీసం ఏదో ఒక పాదమైనా గాని నిరంతరం ఎవరు మనసులో ధారణ చేస్తారో వారికి మోక్షం తథ్యం.

గీత స్వయంగా విష్ణు భగవానుని ముఖపద్మం నుండి వెలువడిం ది. కనుక, గీతను శ్రద్ధాభక్తి పూర్వకం గా పఠించి, నిజ జీవితంలో ఆచరించాలి. అలాంటి వారికి ఆపదలు రా వు. పాప మాలి న్యమంతా తొలగి పోతుందని శాస్త్రా లు చెబుతున్నాయి.