14-04-2025 01:41:31 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి అడవిలోని 1168 కంపార్ట్మెంటులో రెండు రోజుల క్రితం రాత్రిపూట కొందరు జెసిబి తో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించారు.
ఈ ఘటన తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనస్థలికి చేరుకునేసరికి మట్టి తరలించుకుపోయే వ్యక్తులు పారిపోయారు. ఈ ఘటనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నవీన్ కేసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఫారెస్ట్ చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేయుటకు ఎఎఫ్‌ఆర్వో తెలిపారు. సుమారు ఆరు మీటర్ల మేర గొయ్యితవ్వి మట్టి తరలించినట్లు తెలిపారు.