31-03-2025 12:00:00 AM
కనపడిన మట్టి గుట్టలు మాయం..
అర్థరాత్రి మట్టి తోలకాలు..
పట్టించుకోని అధికారులు
కూసుమంచి , మార్చి 30:-కూసుమంచి మండలంలో మట్టి మాఫీయా రెచ్చిపోతుంది .. విచ్చలవిడిగా పగలు , రాత్రి అనే తేడా లేకుండా మట్టి దందా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు.. వీరికి మట్టి గుట్టలు కనపడితే చాలు అక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ట్రాక్టర్ ట్రక్కు కు 500 నుండి 800 రూపాయల వరకు వసూళ్లు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.. ఈ మట్టి మాఫీయాకు భయం అనేది తెలియదు.. ఏకంగా మండల ప్రధాన కూడలి నుండి పోలీస్ స్టేషన్ ఎదురు నుండే మట్టి ట్రాక్టర్లు యదేచ్చగా వెళ్తుంటాయి.. ఒక్క ట్రాక్టర్ కు కూడా నంబర్ ప్లేట్ ఉండదు.. కనీసం పోలీసులు కూడా నంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లు యదేచ్చగా రోడ్డుపై తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.. ఈ మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం కిమ్మనకుండా ఆఫీసులో కూర్చుని చోద్యం చూస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది లేరనే సాకుతో మట్టి మాఫియాకు వెనక నుండి సహకరిస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. గతంలో మట్టి దందాకు కారణం అవుతున్న జెసిబి ఓనర్లపై బైండోవర్ కేసులు పెట్టిన మరల యదావిధిగా మట్టి దందాలు చేస్తున్నారు.. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు మట్టి మాఫియా పై దృష్టి సారించి కట్టడి చేయాలని కోరుతున్నారు..