calender_icon.png 25 March, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి తవ్వకాలు, డివాటరింగ్ ప్రక్రియ వేగవంతం

24-03-2025 12:08:30 AM

నిరంతరాయంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

నాగర్ కర్నూల్ మర్చి 23 ( విజయక్రాంతి):  శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో కార్మికులను గుర్తించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వి రామంగా కొనసాగుతోందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఆదివారం టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో టన్నెల్ లోపల సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ చర్చించారు.

టన్నెల్ లోని డి 1,, డి 2 ప్రదేశాలలో మట్టి తవ్వకాల, ఊట నీటిని బయటకు పంపే ప్రక్రియ నిరంతరాయంగా, వేగంగా జరుగుతున్నాయన్నారు.  అత్యంత ప్రమాద ప్రదేశంగా భావిస్తున్న ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రదేశాలలో సహాయక పనులను వేగవంతం చేసినట్లు వివరించారు. ఘటన జరిగి నెల రోజులు పూర్తయిన కార్మికుల ఆనవాళ్లు చిక్కకపోవడంతో వారి బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 

ఘటన జరిగిన రోజు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు కంటిమీద కునుకు లేకుండా కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకే పనిచేస్తున్నాయని ప్రభుత్వం సోమవారం మరోసారి పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి కార్మికులను బయటకు తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నది.

నెట్వర్క్ సమస్య కారణంగా రోబో యంత్రాలు అడుగు ముందుకు పడకపోవడంతో ప్రస్తు తం ప్రమాదకర పరిస్థితుల్లో  ఆపరేషన్ నిలిచిపోయింది. దాదాపుగా కార్మికులు కూడా అదే ప్రాంతంలో ఉండి ఉంటారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. నిత్యం కడావర్ డాగ్స్ ట్రాక్ హోల్ మైనర్స్ ఇండియన్ రైల్వే ఎన్టిఆర్‌ఎఫ్, ఎస్డిఆర్‌ఎఫ్ వంటి రెస్క్యూ బృందాలు షిఫ్టులవారీగా  పనిచేస్తున్నాయి.